![]() |
![]() |
నాగిని, మిలే జబ్ హమ్, తుమ్ వంటి సీరియల్స్‌తో నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు అర్జున్ బిజ్లానీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో తెలియజేస్తూ ‘తీవ్రమైన కడుపునొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరాను. డాక్టర్లు శనివారం ఆపరేషన్ చేయబోతున్నారు. ఏది జరిగినా మన మంచికే’ అంటూ తను బెడ్‌పై ఉన్న ఫోటోలను పోస్ట్ చేశాడు.
సీరియల్స్‌లో నటిస్తూనే కొన్ని రియాల్టీ షోలలో కూడా పాల్గొంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అర్జున్. తన అద్భుతమైన నటనతో అవార్డులు కూడా గెలుచుకున్నాడు. తెలుగులో ప్రసారమవుతున్న ‘నాగిని’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. అలియా భట్, రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ’ సినిమాలో అతిథి పాత్రలో నటించి అందర్నీ మెప్పించాడు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు అర్జున్ బిజ్లానీ.
![]() |
![]() |